బాలయ్య అభిమానుల గిన్నీస్ రికార్డు: ఈనెల 10న బాలకృష్ణ 60వ బర్త్ డే సందర్భంగా, ఫ్యాన్స్ ఒకే సమయంలో 21 వేల కేకులు కట్ చేసి వరల్డ్ రికార్డులను నెలకొల్పారు. కరోనా వ్యాప్తి కారణంగా, తన బర్త్ డే వేడుకలు నిరాడంబరంగా జరపాలని బాలయ్య అభిమానులకు పిలుపునిచ్చారు. కరోనా రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించడమే నాకు మీరిచ్చే అతి పెద్ద గిప్ట్ అని బాలయ్య పేర్కొన్నారు. బాలకృష్ణ ఆదేశాలను అనుసరించిన ఫ్యాన్స్ వినూత్న రీతిలో ఇంట్లోనే ఉండి, జన్మదిన వేడుకలను నిర్వహించారు. అయితే ఈ వేడుకలు ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి.

2020, జూన్ 10న ఒకే సమయంలో (ఉ: 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లు) 21 వేల కేక్‌లను బాలకృష్ణ ఫ్యాన్స్ కట్ చేశారు. ఈ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిర్వహించగా దాదాపు 80 వేల మందిఈ వేసుకలలో భాగమయ్యారు.
ఈ వేడుకను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పర్యవేక్షించి వరల్డ్ రికార్డుగా ప్రకటించటం జరిగింది. కొన్ని రోజులలో సంబంధిత పత్రాలను బాలకృష్ణకు స్వయంగా అందజేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్బంగా అభిమానులు వారి ఫ్యామిలీ మెంబర్స్ కు ధన్యవాదాలు తెలిపారు బాలయ్య.
సినిమాల్లోనే కాదు బయట కూడా రికార్డులను సృష్టించగలమని బాలయ్య అభిమానులు రుజువు చేశారు.
You May Also Like To Visit: