YSRCP Navaratnalu List (జగన్ నవరత్నాలు) Full Details

YSRCP Navaratnalu List (జగన్ నవరత్నాలు): In this post, you can find the YSRCP Navaratnalu List which also famous as Jagan Navaratnalu in the state of Andhra Pradesh. Navaratnaalu are nothing but the welfare schemes of government of Andhra Pradesh. These schemes are mentioned by the YSRCP party in their election manifesto. After forming the government in AP, Jagan sarkar has started implementing these welfare schemes one by one.

ysrcp-jagan-navaratnalu-list

YSRCP Navaratnalu List – Jagan Navaratnalu Full Details

ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న తొమ్మిది నవరత్న సంక్షేమ పథకాలు మరియు వాటి ప్రధానాంశాలు క్రింద విదంగా తెలుపబడినది. ఈ నవరత్నాలలో ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా, పింఛన్ల పెంపు, మద్యపాన నిషేధం, వైఎస్సార్ చేయూత పథకాలు మొదలైనవి. మిగిలిన వాటిని అమలుచేసే దిశగా జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది.

YSRCP Navaratnalu in English

  1. YSR Rythu Bharosa: The YSRCP promises to offer Rs 50,000 financial assistance to farmers. Starting second year, each farmer family would be given Rs 12,500 per year, in addition to zero-interest loans and free borewells. Cold storages and food processing units in every constituency are among a list of benefits promised to the farmers
  2. Fee Reimbursement: The party, if elected to power, plans to provide a comprehensive fee reimbursement scheme, in line with late Chief Minister Dr YS Rajasekhara Reddy’s vision. In addition to complete fee reimbursement, an allowance of Rs 20,000 would be given to every student.
  3. Arogyasri: The Arogyasri scheme would be applicable to all medical treatments of above Rs 1,000. Regardless of the location of the hospital, all medical expenses would be borne by the government.
  4. Jalayagnam: Under this scheme, lakhs of families would be benefited by the irrigation projects. Completion of Polavaram project on a war footing is promised.
  5. Ban on Alcohol: The YSRCP promises to put in place a ban on sale of alcohol across the State in three stages.
  6. Amma Vodi: With a view to encourage the families with school-going children, the YSRCP promises to provide Rs 15,000 towards assistance to all the mothers who send their children to school.
  7. YSR Asara: All loans pertaining to the women’s co-operative societies would be waived. In addition, zero-interest loans would be issued.YSR Cheyootha through YSR Cheyootha, the YSRCP intends to support all women from SC, ST, BC and Minority Communities, who are aged above 45.
  8. Paydalandariki Illu: In five years, the YSRCP promises to build 25 lakh homes for the poor.
  9. Pensionla Pempu: The eligibility age criteria of 65 years for the pensions would be reduced to 60 years. Senior citizens aged above 60 would be given Rs 2,000 while the physically challenged would be given a pension of Rs 3,000.

వైఎస్సార్ రైతు భరోసా – YSRCP Navaratnalu List (జగన్ నవరత్నాలు) ప్రధాన పధకం

  1. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. పంటవేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తాం.
  2. పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రేమియమ్ మొత్తాన్ని మేమే చెల్లిస్తాం.
  3. రైతన్నలకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం.
  4. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.
  5. వ్యవసాయానికి పగటిపూటే 9 గం. ఉచిత కరెంట్.
  6. ఆక్వారైతులకు కరెంట్ ఛార్జీలు యూనిట్ కు రూ.1.50 కే ఇస్తాం.
  7. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం.
  8. రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు.
  9. ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజక వర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు.
  10. మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్ కు రూ. 4 బోనస్.
  11. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు చేస్తాం, టోల్ టాక్స్ రద్దు చేస్తాం.
  12. ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షలు ఇస్తాం. అంతే కాదు ఆ డబ్బును అప్పులవాళ్ళకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అందగా ఉంటాం.

అందరికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ – Jagan Navaratnalu

  1. వార్షిక ఆదాయం రూ. 5,00,000 దాటని అన్ని వర్గాల వారికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపు.
  2. వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.
  3. ఎన్ని లక్షలు ఖర్చాయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం.
  4. ఎక్కడ చికిత్స చేయించుకున్నా (హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై మొదలగున్నవి) ఆరోగ్యశ్రీ వర్తింపు.
  5. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి.
  6. ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తరువాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా ఆర్ధిక సహాయం.
  7. కిడ్నీ వ్యాధి, తలసేమియా ఇంకా ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్ నెల నెలా ఇస్తాం.
  8. ఆరోగ్యశ్రీ సేవలు ఇంకా మెరుగ్గా పకడ్బందీగా అందిస్తూనే మరోవైపు రెండేళ్లలోగా కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రుల ముఖచిత్రాలు (ఫోటోలు) మీముందుంచుతాం. రెండేళ్ళ తర్వాత ఆ ఆసుపత్రి దశ దిశ మార్చి మారిన ముఖచిత్రాలు మీ ముందుంచుతాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పూర్తిగా పెంచుతాం.

అమ్మఒడి

  1. పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లీ భయపడొద్దు.
  2. పిల్లలని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15,000 ఇస్తాం.

పింఛన్ల పెంపు

  1. ప్రస్తుతం ఉన్న పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తాం.
  2. అవ్వా తాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.
  3. వికలాంగులకు పింఛన్ రూ. 3,000 ఇస్తాం.

పేదలందరికీ ఇళ్ళు

  1. ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా పక్కా ఇళ్ళు కట్టిస్తాం.
  2. ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ళు కట్టిస్తాం.
  3. ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం. వారిపేరునే రిజిష్ట్రేషన్ చేస్తాం, ఇళ్ళు కూడా కట్టిస్తాం.
  4. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లమ్మల పేరుతో రిజిష్ట్రేషన్.
  5. అంతేకాదు డబ్బు అవసరమైతే అదే ఇంటిమీద పావలా వడ్డీకే రుణం వచ్చేట్టుగా బ్యాంక్ లతో మాట్లాడుతాం.

ఫీజు రీయింబర్స్ మెంట్

  1. పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం.
  2. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్ధికి ఇస్తాం.

వైఎస్సార్ జలయజ్ఞం

  1. దివంగత మహానేత వై ఎస్ ఆర్ కలలు కన్న జల యజ్ఞాన్ని పూర్తి చేస్తాం.
  2. పోలవరం, పూలసుబ్బయ్య, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం.
  3. రక్షిత మంచినీరు – సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్దరిస్తాం, జలకళను తీసుకోస్తాం.

మద్యపాన నిషేధం

  1. కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది.
  2. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.
  3. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాం.

వైఎస్సార్ ఆసరా , వైఎస్సార్ చేయూత

  1. ఎన్నికల రోజు వరకు అక్కచెల్లమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం.
  2. అంతే కాదు మళ్ళీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం ఆ వడ్డీ డబ్బు మేమే బ్యాంక్ లకు అక్కచెల్లమ్మల తరపున కడతాం.
  3. వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి బి‌సి ,ఎస్సీ ఎస్టీ , మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం.
  4. ప్రస్తుతం కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా, ఏ కొందరికో అరకొరగ ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్డితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం.
  5. 45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అక్కలకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదట ఏడాది తరువాత దశలవారీగా రూ. 75 వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం.

Leave a Comment